»Amazing Benefits Of Curd In Summer Benefits Are These
Health Tips : వేసవిలో పెరుగుతో అద్భుత ప్రయోజనాలు..బెనిఫిట్స్ ఇవే
వేసవికాలం(Summer Time) వచ్చేసింది. ఎండలు అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఓ వైపు విపరీతమైన ఎండ, మరోవైపు ఉక్కపోత వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. శరీరమంతా వేడి(Heat)గా మారిపోయి ఒక్కోసారి నిద్ర కూడా పట్టకుండా చేస్తుంది. అందుకే శరీరాన్ని చల్లబరిచే ఆహారం తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వేసవిలో పెరుగు(Curd) తినడం వల్ల అనేక బెనిఫిట్స్ పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.

పెరుగు(Curd) రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి(Immunity) పెరుగుతుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచేలా చేస్తుంది. దీనివల్ల శరీరంలో ఇన్ఫెక్షన్స్(Infections) వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పెరుగులోని పోషకాలు ఎముకల(Bones)ను బలంగా చేస్తాయి. పెరుగులో కాల్షియం(Calcium) అధికంగా ఉంటుంది. ఎముకలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా పెరుగు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.
వేసవి(Summer)లో శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్(Dehydration)కు గురవుతుంటుంది. అందుకే రోజూ శక్తివంతంగా ఉండాలంటే పెరుగును తీసుకోవడం ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు. పెరుగు(Curd)లోని లాక్టిక్ యాసిడ్స్ శరీరంలోని హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. బ్యాక్టీరియోసిన్ అనే పదార్థాన్ని పెరుగు ఉత్పత్తి చేయడం వల్ల అది శరీర బరువును నియంత్రిస్తుంది. చాలా మంది అధిక బరువు సమస్య(Weight Problems)తో సతమతమవుతుంటారు. అలాగే నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వులను పెరుగు వాడకంతో సులువుగా తగ్గించుకోవచ్చు.
పెరుగు(Curd)లోని జింక్, విటమిన్ ఇ వల్ల చర్మం(Skin) అందంగా తయారవుతుంది. శరీరంలో అంతర్గత వేడి(Heat) వల్ల ఎక్కువగా చికాకు, తలనొప్పి, ఉబ్బరం, అలసట, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. వీటన్నింటిని పెరుగు తగ్గిస్తుంది. మొటిమలు, చర్మ సంబంధిత సమస్యలుండేవారు పెరుగును క్రమం తప్పకుండా వాడటం మంచిది.
మెదడు(Brain) పనితీరు మెరుగుపర్చటానికి పెరుగు(Curd) దోహదపడుతుంది. అలాగే ఒత్తిడి, టెన్షన్స్, చికాకు వంటివి పోగొట్టడానికి పెరుగు అద్భుతంగా ఉపయోగపడుతుంది. పెరుగు క్రమం తప్పకుండా వాడటం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. అలాగే గుండె జబ్బులు(Heart Problems) రాకుండా పెరుగు కాపాడుతుంది. పెరుగును మజ్జిగ రూపంలో తాగడం వల్ల శరీరానికి మంచి పోషకాలనేవి అందుతాయి. శరీరంలోని నీటి స్థాయిలను మజ్జిగ బ్యాలెన్స్ చేస్తుంది.