»Airtel Launches Unlimited 5g Data Offer For Everyone
Airtel 5G Data Offer: స్మార్ట్ ఫోన్ లో ఈ సిమ్ ఉందా.. ఉంటే అన్ లిమిటెడ్ ఫ్రీ డేటా
స్మార్ట్ ఫోన్(Smart Phone) వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) తన యూజర్ల(Users) కోసం ఫ్రీ 5జీ అపరిమిత డేటా(Unlimited Data)ఆఫర్‌ను ప్రకటించింది.
Airtel 5G Data Offer: స్మార్ట్ ఫోన్(Smart Phone) వినియోగదారులకు శుభవార్త. ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) తన యూజర్ల(Users) కోసం ఫ్రీ 5జీ అపరిమిత డేటా(Unlimited Data)ఆఫర్‌ను ప్రకటించింది. అధిక మొత్తంతో రీఛార్జ్(recharge) చేసుకునే వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. మరో కంపెనీ రిలయన్స్ జియో ఇటీవలే జియో ప్లస్ పేరిట పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్యాక్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్టెల్ తీసుకొచ్చిన ఈ అన్ లిమిటెడ్ డేటా ఇంట్రడక్టరీ ఆఫర్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది.
అలాగే రూ. 239, అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకున్న ప్రీపెయిడ్ యూజర్ల(prepaid users)కు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ ను పొందాలంటే.. 5జీని సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్లతో పాటు ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్(Airtel 5G network) అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఎయిర్ టెల్ 5జీ సేవలు దేశవ్యాప్తంగా 3,000 పట్టణాలకు చేరుకున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల్లోని కస్టమర్లు 4జీ ప్యాక్ పై 5జీ డేటాను పొందొచ్చని తెలిపింది. ఈ ఆఫర్ ను పొందాలంటే.. ఎయిర్టెల్ (Airtel 5G data) థ్యాంక్స్ యాప్‌లోకి వెళ్లి అన్లిమిటెడ్ 5జీ డేటా ఆఫర్‌ను పొందొచ్చు. యాప్ లేకపోతే డౌన్ లోడ్(download) చేసుకుని, ఇన్ స్టాల్(install) చేసుకోవాలి. యాప్ తెరిచిన తర్వాత ‘క్లెయిమ్ యువర్ అన్ లిమిటెడ్ 5జీ డేటా’అని కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయాలి. ఆ తర్వాత పరిమితి లేకుండా 5జీ డేటా ప్రయోజనాలను ఆనందించొచ్చు. 2024 మార్చి నాటికి అన్ని నగరాల్లో విడుదల చేస్తామని ఎయిర్టెల్ ప్రకటించింది.