Revanth Reddy: అవార్డులు తెచ్చిన కార్యదర్శులను పట్టించుకుంటలేరు..కేసీఆర్ ఇకనైనా
అసెంబ్లీ సాక్షిగా పంచాయతీ కార్యదర్శుల(Panchayat Secretary)కు ఇచ్చిన హామీకే దిక్కులేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(PCC chief Revanth Reddy) సీఎం కేసీఆర్(CM KCR) పై మండిపడ్డారు. గత 12 రోజుల నుంచి జూ. పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తుంటే ఈ కేసీఆర్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు.
Revanth Reddy : అసెంబ్లీ సాక్షిగా పంచాయతీ కార్యదర్శుల(Panchayat Secretary)కు ఇచ్చిన హామీకే దిక్కులేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(PCC chief Revanth Reddy) సీఎం కేసీఆర్(CM KCR) పై మండిపడ్డారు. గత 12 రోజుల నుంచి జూ. పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తుంటే ఈ కేసీఆర్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. సమ్మె చేస్తున్న కార్యదర్శుల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తు సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ(letter) రాశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరిలను తక్షణమే రెగ్యులరైజ్(Regularize) చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆగ్రహించారు.
కేసీఆర్ సర్కార్(KCR Sarkar) దేశానికే మా పంచాయతీలు ఆదర్శం అందుకే కేంద్రం అవార్డులు(Awards) ఇస్తుంది అని గొప్పలు చెప్పుకుంటుందన్నారు. ఆ గొప్పల వెనుక పంచాయతీ కార్యదర్శుల కఠిన శ్రమ దాగి ఉందన్నారు. వారి శ్రమతో రాష్ట్రంలోని 79 గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చిన విషయాన్ని మరిచిపోవద్దని రేవంత్(revanth) హితవు పలికారు. ఇంత కష్ట పడి అవార్డులు తెస్తే వారిని రెగ్యులర్ చేయకుండా వేధించడం సరికాదన్నారు. వారి కష్టానికి తమ ప్రభుత్వం ఇచ్చే రివార్డు ఇదేనా? అంటూ ప్రశ్నించారు. సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడటం సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో అసలు పాలన నడుస్తోందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యులరైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. జూ.పంచాయతీ కార్యదర్శు(Panchayat Secretary)ల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు.