కేరళలోని వయనాడ్లో ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ కేంద్రాలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. వారు తనపై చూపించిన ప్రేమను తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు. వక్ఫ్ చట్టం గురించి విలేకరులు ప్రశ్నించగా.. ఇవాళ ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లదల్చుకోలేదంటూ సమాధానమిచ్చారు.