ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు మరోసారి GST డిమాండ్ నోటీసులు వచ్చాయి. జొమాటో వసూలు చేసిన డెలివరీ ఫీజుపై జీఎస్టీకి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందని నోటీసుల్లో పేర్కొన్నట్లు కంపెనీ తెలిపింది. రూ.803.4కోట్లు చెల్లించాలని ఆదేశించినట్లు చెప్పింది. డెలివరీ ఛార్జీలపై బకాయిలు.. దానికి వడ్డీ, పెనాల్టీ కింద ఈ మొత్తం చెల్లించాల్సి ఉంది. అయితే దీనిపై అధికారుల వద్దకు అప్పీలుకు వెళ్లనున్నట్లు జొమాటో వెల్లడించింది.