చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇలా జరగటం ఒక నెల వ్యవధిలో ఇది రెండోసారి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో చాట్‌జీపీటీ మొరాయించింది. యూజర్లు.. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ సమస్యను ఎదుర్కొన్నారు. అప్‌స్ట్రీమ్ ప్రొవైడర్ వల్లే ఈ సమస్య వచ్చినట్లు గుర్తించామని ఓపెన్ఏఐ తెలిపింది.