ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్లో నడుస్తోంది. తమ అభిమాన హీరోల సినిమాలను పోటా పోటీగా రీ రిలీజ్ చేస్తు రచ్చ రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ టైం స్టార్ట్ అయింది. అయితే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల స్పెషల్ షోస్ ప్లాన్ చేయడం విశేషం. ఇప్పటికే మెస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఘరానా మొఘుడు.. మహేష్ బాబు ఫ్యాన్స్ పోకిరి, ఒక్కడు.. పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సా, తమ్ముడు.. బాలయ్య అభిమానులు చెన్నకేశవరెడ్డి.. సినిమాలను రీ రిలీజ్ చేసి దుమ్ముదులిపారు.
ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ అదే పనిలో ఉన్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరగనున్నాయి. దాంతో ఇప్పటికే అక్టోబర్ 15న, కృష్ణం రాజు కీలక పాత్రలో నటించిన ‘రెబల్’ సినిమా స్పెషల్ షోతో.. ఫుల్లుగా ఎంజాయ్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకు సంబంధించిన థియేటర్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అక్టోబర్ 22, 23 తేదీలలో ‘వర్షం’ సినిమాను.. 4కే టెక్నాలజీతో తెలంగాణతో పాటు ఏపీలో రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత ఎం.ఎస్.రాజు ప్రకటించారు.
ఇక ఇప్పుడు ‘బిల్లా’ స్పెషల్ షో టైం వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 23న, 4K క్వాలిటీతో బిల్లాను రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దాంతో ఈసారి ప్రభాస్ బర్త్ డేను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రభాస్ సైతం పుట్టిన రోజు కానుకగా.. కొత్త సినిమాల అప్టేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.