బనానా టేప్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి సోథ్‌బే సంస్థ నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో 6.2 మిలియన్ డాలర్ల ధర పలికింది. ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ సృష్టించిన బనానా టేప్‌ను క్రిప్టోకరెన్సీ వ్యవస్థాపకుడు జస్టిన్ సన్ వేలంలో దక్కించుకున్నారు. ‘కమెడియన్’గా పిలిచే ఈ ‘బనానా టేప్’ను కళాఖండమా? కాదా? అనే విషయంపై 2019లో వివాదం మొదలైంది.