AP: రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం చెప్పారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టుపై సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సమగ్ర రవాణా ప్రణాళికను ఇప్పటికే కేంద్రానికి పంపామన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు.