ఉత్తరాన చిరాగ్ పాశ్వాన్, దక్షిణాన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం పోలికలు ఆసక్తికరం. 2019లో ఇద్దరూ కూటమి నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేసి చెరొక స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే, మళ్లీ NDAలో చేరారు. ఏపీలో పవన్ తన పార్టీని అన్ని స్థానాల్లో గెలిపించగా, చిరాగ్ పార్టీ కూడా ఎంపీ ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటారు.