KDP: సిద్ధవటం పెన్నానది హైలెవెల్ వంతెనపై వినాయకుడి విగ్రహాల నిమజ్జనం కోసం ఓవైపు మట్టి రహదారి ఏర్పాటు చేసి గణనాథుడి నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయకుడి ఉత్సవాల అనంతరం మట్టి కుప్పలు తొలగించకపోవడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని ప్రయాణికులు తెలిపారు. వంతెనపై మట్టి కుప్పలు తొలగించాలని వాహనదారులు పరిసర ప్రజలు కోరుతున్నారు.