AP: కడప జమ్మలమడుగు మండలం గండికోటలో BJP MP CM రమేష్‌కు చెందిన రిత్విక్ కంపెనీ పనులను BJP MLA ఆదినారాయణరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. గండికోటలో పనులు చేస్తున్న కంపెనీ సిబ్బందిపై MLA అనుచరులు దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు సిబ్బందికి గాయాలు కాగా 3 సెల్ఫోన్లు ధ్వంసమయ్యాయి. ఆఫీస్‌లో అద్దాలు, కంప్యూటర్లను పగలకొట్టారు. ఘటనాస్థలికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు.