TG: PM మోదీపై మాజీమంత్రి KTR తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోదీ నిన్న తన ప్రసంగంలో H-1B వీసా గురించి మాట్లాడతారని ఆశించామని, కానీ ఆయన GST గురించి చెప్పారని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా GST పేరుతో ప్రజల రక్తం తాగి.. ఇప్పుడు పండుగ చేసుకోమనడం విడ్డూరమన్నారు. మోదీ గతంలో చెప్పినట్లుగా ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తే తాము నిజంగా పండుగ చేసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.