AP: యూరియాపై రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. 7.86 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటికే 6.90 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని చెప్పారు. ఇంకా 97 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉందన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.