ఒక్క సినిమా హిట్ కాగానే ఆడంబరాలకు పోయే హీరోలు ఉన్నారని నిర్మాత బండ్ల గణేష్ K-RAMP సక్సెస్ మీట్లో అనడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. తాను ఎవరినీ ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నాడు. కళామతల్లి ఆశీస్సులతో అందరం పైకి రావాలనేది తన ఉద్దేశమని చెప్పాడు. ఒకవేళ తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే సారీ చెబుతున్నానని తెలుపుతూ పోస్ట్ పెట్టాడు.