మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కృషి మూలంగానే మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధికి రూ. 824 కోట్ల మంజూరైనట్టు డీసీసీ జనరల్ సెక్రెటరీ సిరాజ్ ఖాద్రి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు కృతజ్ఞత తెలిపేలా రేపు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.