9 జిల్లాల్లో APSPDCL విద్యుత్ ఉద్యోగుల 100 మంది ఇళ్లకు ప్రయోగాత్మకంగా ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చి అధ్యయనం చేయాలని CMD శివశంకర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఈ – వ్యాలెట్ రీఛార్జింగ్, SMS అలెర్ట్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇది సక్సెస్ అయితే అందరి ఇళ్లకు వీటిని అమర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.