AP: అనంతపురం జిల్లా వెంగన్నపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. వైసీపీ నేతలు కోటి సంతకాల సేకరణ చేపట్టారు. దీనిని TDP నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ దాడిలో వైసీపీ నేతలకు గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. వారిని వైసీపీ నేత పెద్దారెడ్డి పరామర్శించారు.