BDK: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ దశదినకర్మలు బుధవారం హైదరాబాదులో నిర్వహించారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత, BRS పార్టీ నాయకులు పాల్గొన్నారు.