W.G: కాళ్లకూరు శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో శ్రీలక్ష్మీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా సోమవారం మొదటిరోజు అమ్మవారు శ్రీ ఆదిలక్ష్మిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజ, అష్టోత్తర శత నామ పూజ, నీరాజన మంత్రపుష్పము ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.