NRPT: గుండుమల్ మండలం కొమ్మూరు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరం ఉందని స్థానిక ప్రజలు తెలిపారు. గ్రామంలో సరైన సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ బురద గుంతలమయంగా మారుతున్నాయన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ నియోజకవర్గ పరిధిలోకి ఈ గ్రామం కూడా రావడం గమనార్హం.