ప్రకాశం: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని కనిగిరి మున్సిపాలిటీ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. సోమవారం ‘స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని చింతల పాలెంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం కొరకు చక్కెర, ఉప్పు, నూనె వాడకాలను తగ్గించాలని అన్నారు.