VZM: నెలిమర్ల మండలంలోని కొండవెలగాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం స్వస్త్ నారీ ససక్త్ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బంగారమ్మ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. అలాగే గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.