VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో సోమవారం దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ విష్ణు ఆలయంలో కలశ స్థాపనతో శ్రీ ఆదిలక్ష్మి అవతారంతో ఆలయ అర్చకులు చాణక్య, హార్ష, శ్రీ కృష్ణ తేజ శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఇందులో ట్రస్ట్ సభ్యులు నారాయణం నీరజా శ్రీనివాస్,భక్తులు సిబ్బంది పాల్గొన్నారు.