HYD: ట్రేడింగ్ పేరిట వాట్సాప్ గ్రూపులో లింకు ద్వారా ఫేక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి సైబర్ నేరగాళ్లు ఓ మహిళను బురిడీ కొట్టించారు. ట్రేడింగ్ ద్వారా లాభాలు వస్తాయని చెప్పడంతో అల్వాల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ వారిని నమ్మింది. కానీ.. పలు దఫాలుగా మహిళ ఏకంగా రూ.2 కోట్లు పోగొట్టుకున్నట్లుగా తెలిపింది.