కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఆ రోజున ఎవ్వరిని నొప్పించకూడదు. అదే విధంగా వెండి పాత్రలు, పాలు దానం చేయకూడదు. ఇవి దానం చేయడం వలన ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లోని ఏ గదిని చీకటిగా ఉంచొద్దు. అలా ఉంచితే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టదు. ఇంకా నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. తెలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదమని చెబుతున్నారు.