KKD: పెదపూడి మండలం పెద్దాడ పీహెచ్సీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగ విరమణ పొందడంతో వారి స్థానంలో వేరొకరు లేనందువలన గత నెల రోజులుగా రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ల్యాబ్ టెక్నీషియన్ అందించే 59 సేవలకు గాను, ఆసుపత్రి సిబ్బంది కేవలం రెండు సేవలు మాత్రమే అందిస్తున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.