పనామా కాలువ నుంచి వచ్చే షిప్పుల నుంచి అధికంగా పన్నూ వసూళ్లు చేస్తున్నారని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. అందువల్ల పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాని ఆయన హెచ్చరించారు. ట్రంప్ చేసిన బెదిరింపులపై ఆయనతో చర్చించాల్సిన అవసరం లేదని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో పేర్కొన్నారు. న్యాయబద్ధంగానే ఓడల నుంచి పన్నులను వసూళ్లు చేస్తున్నట్లు చెప్పారు.