TG: కాగితాలపై ఆలోచనలు పెడితే సరిపోదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని విమర్శించారు. గత పాలకులు బంగారు తెలంగాణ చేస్తామన్నారని.. కానీ అప్పుల తెలంగాణ చేశారని మండిపడ్డారు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్మిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో వెళ్తోందన్నారు. భవిష్యత్ తరాలకు భూమి దొరికే పరిస్థితి ఉండదన్నారు.