తలకి నూనె పెట్టకపోవటం, చలికాలంలో చర్మం పొడిబారటం వల్ల జుట్టు సమస్యలు వస్తాయి. చుండ్రు ఏర్పడి తలలో దురద పుడుతుంది. కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారానికోసారైనా కొబ్బరి, బాదం, ఆలివ్ వంటి నూనెలని తలకి పట్టించాలి. నూనె కాస్త వేడిచేసి అప్లై చేసుకుంటే రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల దురద తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. తడి జుట్టుని ఎప్పుడూ ముడి వేయకూడదు.