రష్మిక నెక్స్ట్ సినిమా గర్ల్ ఫ్రెండ్ గురించి పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ ప్రస్తావించాడు. ఆ సినిమా టీజర్ చూశాడని, రష్మిక నటన వేరే లెవెల్లో ఉందంటూ పొగిడేశాడు. అయితే ఈ టీజర్లో మరో ప్రత్యేకత కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఇందులో రష్మిక పాత్రను పరిచయం చేయడం లాంటి సీన్స్‌కు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో గర్ల్ ఫ్రెండ్ టీజర్‌పై మరింత ఆసక్తి నెలకొంది.