SDPT: అక్బ ర్‌పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పోతనక అభిలాష్ డాడ్జ్‌బాల్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. సిద్దిపేట నుంచి జిల్లా స్థాయికి, జాతీయ స్థాయికి ఎదిగిన అభిలాష్.. క్రికెట్‌తో సహా ఇతర క్రీడల్లోనూ చురుకైన పాత్ర పోషించేవాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో జరిగిన టెస్టులో మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు.