TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను తన జీతం నుంచి చెల్లిస్తానని ప్రకటించారు. పేద విద్యార్థుల చదువుకు అడ్డంకులు ఉండకూడదని ఆంత్యోదయ స్ఫూర్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.