AP: అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానాలిచ్చారు. ఐదు నెలల్లో 25 వేల కిలోల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. గంజాయి సాగు చేసినా.. తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. గత ఐదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని విమర్శించారు. గతంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిందని మండిపడ్డారు. యాంటీ నార్కొటిక్స్ టాస్క్‌ఫోర్స్‌తో నేరస్థులను అణచివేస్తామని అన్నారు.