CTR: ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో కుప్పం మండలం పెద్దవంక వద్ద శ్రీకనక నాచమ్మ ఆలయం ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు భక్తులను దృష్టిలో పెట్టుకుని ఆ గుడికి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం తదితరులు ఈ సర్వీసును బుధవారం ప్రారంభించారు. కాగా, భక్తుల సౌకర్యార్థం బస్సు ఏర్పాటు చేసినట్లు మునిరత్నం తెలిపారు.