TG: గత BRS పాలనలో కొన్ని అవమానాలు ఎదుర్కొన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో బీఆర్ఎస్ చెప్పిన హామీలు నిరుద్యోగ భృతి, దళితులకు భూమి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల అవినీతిపై తాను సవాల్ చేస్తే స్పందించలేదని అన్నారు. గత 10 ఏళ్ల పాలన వల్ల నెలకు రూ.6,500 కోట్లు వడ్డీలు కడుతున్నామన్నారు.