యూపీలోని ప్రయాగ్రాజ్లో కొనసాగుతోన్న మహాకుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో దేశవిదేశాల నుంచి తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 60 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు CM యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. చివరి రోజైన మహాశివరాత్రి వరకు 60 కోట్ల మంది వస్తారని అనుకున్నామని.. కానీ అంతకు ముందే ఆ సంఖ్య దాటిపోయిందని CM పేర్కొన్నారు.