TG: కాంగ్రెస్కు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి లేరని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఓటుకు రూ.7 వేలు కాంగ్రెస్ పంచుతుందని ఆరోపించారు. డబ్బుల కోసం LRS పెట్టి రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని.. ప్రజలకు సేవ చేయటం, వారి తరపున పోరాడటమే ముఖ్యమని తెలిపారు.