AP: ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు కీలక సూచనలు చేసింది. మధ్యాహ్నం వేళల్లో పిల్లలను ఎండలోకి పంపవద్దని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. పిల్లలు ఈత కోసం బావులు, చెరువులు, కాలువలు వంటి నీటి ప్రాంతాలకు వెళ్ళకుండా పర్యవేక్షించాలని హెచ్చరించింది.