ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా కొత్త బైకును XSR 155 పేరిట మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ.1.50 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ఈ బైకులో 155CC లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఉంది. ఇది గరిష్ఠంగా 10,000 RPM వద్ద 18.4 HP శక్తిని విడుదల చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చారు. లుక్ పరంగా FZ-X మోడల్‌ను తలపిస్తోంది.