AP: ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ల పండుగ ఘనంగా జరుగుతోందని CM చంద్రబాబు అన్నారు. తొలి VC కట్టమంచి రామలింగారెడ్డి బలమైన పునాదులు వేయగా, రెండో VC సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడి నుంచే రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. వర్సిటీలు మన చారిత్రిక సంపదని.. వాటిని కాపాడుకోవాలని CM పేర్కొన్నారు. తెలుగు వైభవానికి, అనేకమంది కవులు, రచయితలకు AU ఎంతో గుర్తింపునిచ్చిందని కొనియాడారు.