AP: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 24న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 24న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు చర్చించనున్నారు. అదే రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు మాట్లాడుతారు.