ప్రకాశం: ప్రభుత్వాలు అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని సీపీఎం నాయకులు పునాటి ఆంజనేయులు విమర్శించారు. ఒంగోలులోని సుందరయ్య భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సర్వే ఈ విషయాన్ని చెప్పిందని గుర్తు చేశారు. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. ప్రజల ఆదాయాలు పెంచేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలన్నారు.