NLG: విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె మునుగోడు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ, బాలికల, బాలుర వసతి గృహాలు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిచాలన్నారు.