VZM: జిల్లాలో రైతుల నుంచి టమాటో కొనుగోలు ప్రారంభించామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు బి.రవి కిరణ్ శుక్రవారం తెలిపారు. మండలంలోని కొండకరకాంలో బి.వాసు అనే రైతు నుంచి 500 కిలోల టమాటో పంటను కొనుగోలు చేశామన్నారు. ఒక్కో బాక్స్ 220 రూపాయల వంతున 20 బాక్సులు కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పంటను రైతు బజార్లో విక్రయిస్తామన్నారు.