NRML: కుబీర్ మండలంలోని పల్సి గ్రామం పాఠశాల విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. పాఠశాల ఆవరణలోని చెట్లకు గుళ్లుగా కట్టి వాటిలో పక్షులకు ఆహారం, నీరు ఉంచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. వేసవికాలం సమీపిస్తున్న వేళ విద్యార్థుల స్వయంకృషితో తయారు చేసిన గుళ్లు, పక్షులకు ఆహారం, నీరు అందించడం పట్ల అభినందించారు.