GNTR: చెల్లికి పెళ్లి చేయాలని స్నేహితులను నమ్మించి 15 కేజీల బంగారాన్ని సంస్థ మేనేజరే చోరీ చేయించాడు. ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఈనెల 15న జరిగిన చోరీ కేసును మంగళగిరి పోలీసులు చేధించారు. దీవి నాగరాజు విజయవాడలో ఓ జువెలరీలో మేనేజర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో బంగారంతో వెళుతుండగా చోరీ జరిగింది. పోలీసులు విచారణ చేయించి నిందితుడు నాగరాజేనని తేల్చారు.