GNTR: మంగళగిరి శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి శుక్రవారం వ్యాఘ్ర వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు పొంగలి ప్రసాదాన్ని ఆలయ పూజలు పంపిణీ చేశారు. దేవస్థానం ఈవో జేవీ నారాయణ ఆలయంలో చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.