SDPT: సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని జూన్ మొదటి వారంలోగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్మేటలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ పనులను అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులపై ఆరా తీశారు.