తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారు. ‘హిందీ భాషపై రాజకీయాలు చేయటం సరికాదు. తమిళ భాషాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. విద్యార్థుల భవిష్యత్ కోసమే జాతీయ విద్యా విధానం. BJP అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా రాజకీయాలకతీతంగా ఈ విద్యా విధానం అమలు జరిగింది. ఈ విధానం అమలు చేయకపోవటం వల్ల తమిళనాడుకు రూ.5 వేల కోట్ల నిధులు రాలేదు’ అని తెలిపారు.